ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:29 AM
జిల్లాలోని పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు జాతీయ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నెల్లూరు, ఏప్రిల్ 24: జిల్లాలోని పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు జాతీయ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని నాయుడు పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వివరించారు. బెంగళూరు నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ ఆదిలక్ష్మీ పరిశీలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ
మొజ్తాబాకు శాస్త్ర చికిత్స అవసరం.. ఇంటర్నేషనల్ మీడియా
For More AP News And Telugu News