Share News

మొజ్తాబాకు శాస్త్ర చికిత్స అవసరం.. ఇంటర్నేషనల్ మీడియా

ABN , Publish Date - Apr 24 , 2026 | 07:59 AM

అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానికి దాడుల్లో ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారా? ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నారా? అంటే అవుననే చెబుతోంది ఇంటర్నేషనల్ మీడియా. ఇంకా ఏం చెప్పారనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

మొజ్తాబాకు శాస్త్ర చికిత్స అవసరం.. ఇంటర్నేషనల్ మీడియా

వాషింగ్టన్, ఏప్రిల్ 24: అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానికి దాడుల్లో ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో బెడ్‌పై స్పృహలోనే ఉన్నారని ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. మొజ్తాబా మాట్లాడుతున్నారని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు గతంలో అనేక వార్తలు రాగా.. వాటన్నింటినీ ఇరాన్ ప్రభుత్వ పెద్దలు ఖండించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. కానీ, అంతర్జాతీయ మీడియా మాత్రం మొజ్తాబా తీవ్ర గాయాలపాలై.. మంచానికి పరిమితమైనట్లు కథనాలు ప్రచురించింది. ఆయన ఎవరితోనూ మాట్లాడలేక పోతున్నారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మొజ్తాబాపై మరో కథనం వెలువడింది.


ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం..

ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం.. మొజ్తాబాకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన కాలికి మూడు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆయనకు కృత్రిమ కాలు అమర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. చేతికి సైతం శస్త్ర చికిత్స జరిగినట్లు వెల్లడించారు. ముఖం, పెదవులకు తీవ్ర గాయాలు అవడంతో మాట్లాడలేకపోతున్నారని.. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టం చేశారు.


రంగంలోకి దేశాధ్యక్షుడితోపాటు ఆరోగ్య శాఖ మంత్రి..

మోజ్తాబా ఆరోగ్యాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తోపాటు ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో భద్రతా కారణాల రీత్యా.. మోజ్తాబాను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఐఆర్‌జీసీ సీనియర్ కమాండర్లు, ఉన్నతాధికారులను సైతం అనుమతించడం లేదని తెలుస్తుంది.


పరిగణలోకి మొజ్తాబా అభిప్రాయం: స్పీకర్

ఇక వాషింగ్టన్ అణు ప్రతిపాదనపై ఇరాన్ స్పందనను మొజ్తాబాతో కలిసి పంచుకున్నామని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ వెల్లడించారు. ఆయన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.


తండ్రి మరణంతో మొజ్తాబా బాధ్యతలు..

ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఆ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మొజ్తాబా నివాసంపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించినట్లు కథనాలు వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తుంగభద్ర కేటాయింపులు కుదించేందుకు వీల్లేదు

పోలవరం రెండో దశపై నివేదిక ఇవ్వండి

For More International News And Telugu News

Updated Date - Apr 24 , 2026 | 08:22 AM