పోలవరం రెండో దశపై నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:50 AM
పోలవరం రెండో దశలో 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటి నిల్వకు అవసరమైన భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు..
ఈఎన్‌సీని ఆదేశించిన సీఎంఓ
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పోలవరం రెండో దశలో 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటి నిల్వకు అవసరమైన భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు, ముంపు ప్రభావంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తిని ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల కాంటూరులో నీటి నిల్వ చేసేందుకు వీలుగా అడుగులు వేస్తున్న తరుణంలో దీనిపై నివేదిక ఇవ్వాలని ఈఎన్‌సీని సీఎం కార్యాలయ కార్యదర్శి రాజమౌళి ఆదేశించారు.