Share News

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:08 PM

పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు.

సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ
Sangareddy Cyber Fraud

సంగారెడ్డి జిల్లా, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి.. ప్రవీణ్ కుమార్, రాజేశ్ మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్‌కు సంబంధించిన రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తూ మోహన్ రెడ్డిని బెదిరించారు. ఈ కేసులో మీ పేరుతో కూడా లావాదేవీలు జరిగాయని, దాదాపు రూ.2 కోట్ల ట్రాన్సాక్షన్లు, వాటిపై కమిషన్ తీసుకున్నారని చెప్పి ఆయనను భయభ్రాంతులకు గురిచేశారు. ‘మీపై కేసు నమోదైంది, అరెస్ట్ చేయాల్సి ఉంటుంది’ అంటూ ఒత్తిడి చేశారు.


దీంతో భయపడిన మోహన్ రెడ్డి, దశలవారీగా పలు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.58.94 లక్షలు బదిలీ చేశారు. అనంతరం ఇది మోసమని గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు తరచుగా అధికారులుగా నటిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు ఇలాంటి కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 12:15 PM