స్మగ్లర్లపై కఠిన చర్యలు.. డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
ABN , Publish Date - Jul 07 , 2026 | 03:27 PM
పోలీస్ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగవద్దని సిబ్బందిని కోరుతున్నామని అన్నారు.
ఖమ్మం జిల్లా, జులై 7 (ఆంధ్రజ్యోతి): పోలీస్ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగవద్దని సిబ్బందిని కోరుతున్నామని అన్నారు. ఈరోజు (మంగళవారం) ఖమ్మం జిల్లాలో డీజీపీ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం కమిషనరేట్‌లో సిబ్బంది పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఖమ్మం కమిషనరేట్‌కి వచ్చానని తెలిపారు. ఖమ్మం తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై సమీక్షించానని పేర్కొన్నారు.
ఏఐపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం..
గత మూడేళ్లుగా జరుగుతున్న నేరాలపై సమీక్షించామని డీజీపీ తెలిపారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. 6500 మంది అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. ప్రతి రోజూ 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది పనిభారంపై చర్చించామని చెప్పుకొచ్చారు. ఏఐపై సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను తీసుకువస్తున్నాం..
స్మగ్లర్లపై చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఛత్తీస్‌ఘడ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి ఫెడ్లర్లు వస్తున్నారని అన్నారు. సరిహద్దుల్లో గట్టి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సైబర్ క్రైంపై గట్టి నిఘా ఉంచామని వెల్లడించారు. సోషల్ మీడియాలో అసాంఘిక కార్యకలాపాలను ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. ట్రాఫిక్ సిస్టమ్‌ను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను తీసుకువస్తున్నామని వెల్లడించారు. హైవేలపై అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని.. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్.. తెలంగాణకు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి: మంత్రి పొంగులేటి
కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా
Read Latest Telangana News And And National News
And Telugu News