బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజీనామా..!
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:33 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. అశ్వారావుపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. అశ్వారావుపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (Thati Venkateshwarulu) గులాబీ పార్టీకి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. రెండు రోజుల్లో అనుచరులతో మాట్లాడి అధికారిక ప్రకటన విడుదల చేస్తానని తెలిపారు. ఈరోజు (మంగళవారం) తాటి వెంకటేశ్వర్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
అయితే, గత సార్వత్రిక ఎన్నికల ముందు అసంతృప్తితో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో తాటి వెంకటేశ్వర్లు చేరారు. కాంగ్రెస్ టికెట్ కూడా రాకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఆయన చేరారు. గౌరవం లేని చోట తాను ఉండలేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వంపై తాటి వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్
రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News