Share News

గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలి: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:45 PM

గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.

గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధం కావాలి: మంత్రి తుమ్మల
Telangana Minister Thummala Nageswara Rao

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయలో గోదావరి వరదల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికపై ఈరోజు(శనివారం) జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

THUMMALA-1.jpg


అధికారులు సమన్వయం చేసుకోవాలి..

జిల్లా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏపీఓ రాహుల్, మేయర్ మూడ్ గణేశ్, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. గత వరదల అనుభవాలను పరిగణలోకి తీసుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వరదల వల్ల రహదారులు బ్లాక్ అయ్యే గ్రామాలను గుర్తించాలని సూచించారు. అత్యవసర వైద్యసేవలు, నిత్యావసర వస్తువుల రవాణాకు అడ్డంకులు లేకుండా యాక్షన్ ప్లాన్ ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

THUMMALA-3.jpgTelangana Minister Thummala Nageswara Rao


ఈ వార్తలు కూడా చదవండి...

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 01:01 PM