Share News

షేర్.. లైక్.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సోషల్‌ మీడియా

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:16 PM

మనిషి మనుగడకు కమ్యూనికేషన్‌ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్‌ మీడియా ఓ మాద్యమంగా మారింది.

షేర్.. లైక్.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సోషల్‌ మీడియా
World Social Media Day

  • నేడు ప్రపంచ సోషల్‌ మీడియా దినోత్సవం

కరీంనగర్‌: మనిషి మనుగడకు కమ్యూనికేషన్‌ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్‌ మీడియా ఓ మాద్యమంగా మారింది. సోషల్‌మీడియా కొన్నేళ్లుగా ప్రపంచాన్ని ఒక్క చోటుకు చేర్చి మనుషుల మధ్య దూరాన్ని తగ్గించిన, విప్లవాత్మక మార్పులు తీసు కొచ్చింది. ఒకప్పుడు పక్షులు (పావురాలు, డేగలు, గ్రద్దలు), వేగులు, గూఢచారులు, ఉత్తర ప్రత్యుత్తరా లు, పత్రికలు, ఆ తర్వాత టెలీగ్రామ్‌లు, టెలీఫోన్‌ల ద్వారా సమాచారాన్ని తెలుసుకునేవారు.


నాగరికత, నూతన ఆవిష్కరణలు పెరిగిన కొద్దీ మానవుడు మ రింత ముందుకు వెళ్లడంతో కంప్యూటర్‌లు, వాట్సాప్‌, ట్విట్టర్‌, ఇన్స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, పేస్‌బుక్‌ వంటి ప్రసార మాధ్య మాలు బిలియన్ల ప్రజలను ఏకం చేస్తున్నాయి. సమా జంలోని మంచి చెడులపై సమాన ప్రభావ చూపు తున్నా దీని విలువ మాత్రం తగ్గడం లేదు. ప్రజలు సోషల్‌ మీడియా ద్వారా తమ భావాలను, అను భవాలను, అప్పటికప్పుడు జరిగిన సంఘటనలు, దృశ్యాలను ఇతరులతో పంచుకుంటున్నారు. మంగళ వారం ప్రపంచ సోషల్‌ మీడియా దినోత్సవం సం దర్భంగా ప్రత్యేక కథనం....


  • నేపథ్యం..

నెట్‌వర్కింగ్‌, వ్యాపారంపై డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ లు చూపే ప్రగాఢ ప్రభావాన్ని గుర్తించడానికి ప్రతీ యేటా జూన్‌ 30న సోషల్‌ మీడియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ‘సిక్స్‌ డిగ్రీస్‌’ 1997లో వచ్చింది. తర్వాత అనే క ప్లాట్‌ఫామ్‌లు ఏర్పడ్డాయి.ఈ వేడుక ప్రజల మ మేకంతో పాటు విభిన్న సంస్కృతుల మధ్య సమా జం పరస్పరం వ్యవహరించే విధానాన్ని ఎలా మా రుస్తాయో తెలియజేస్తుంది. ప్రపంచ సోషల్‌ మీడి యా దినోత్సవాన్ని వార్తలు, టెక్నాలజీ వెబ్‌సైట్‌ అ యిన మాషబుల్‌2010 జూన్‌ 30న ప్రారంభించింది.


jgl1.2.jpg

  • మంచి, చెడులపై తీవ్ర ప్రభావం...

సోషల్‌ మీడియా మంచి చెడులపై సమానంగా తన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీన్ని మంచిగా వాడితే మేలు, చెడుగా ఉపయోగిస్తే కీడు సంభ విస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. సోషల్‌ మీడియాలో వస్తు న్న పలు దృశ్యాలు, అంశాలు, దుర్మార్గాలు, అన్యాయ అక్రమాలు, అబద్ధ, అసత్య ప్రచారాలు, చెడు అలవా ట్లను వీక్షించి వాటికి బానిసలుగా మారి సంఘ విద్రో హ, సమాజ అభివృద్ధి నిరోధకులుగా మారి కటకటాలు లెక్కిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో పెట్టిన ఆయా రం గాలకు చెందిన వాటిని యుక్తా యుక్త విచక్షణతో స్వీకరిస్తే సమాజం బాగు పడుతుంది. సోషల్‌ మీడియాను వాడే వారెంత జాగ్రత్తగా ఉండాలో అప్‌లోడ్‌ చేసేవారు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సోషల్‌ మీడియా నియంత్రణ, విధివిధానాలపై ఓ చట్టం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ప్రపంచవ్యాప్త ప్రభావం...

సోషల్‌ మీడియా కేవలం ప్రొఫైల్‌ను పం చుకునే సాధనం నుంచి వార్తలు, క్రియాశీల త, జర్నలిజం, ఇ-కామర్స్‌కు ఒక కీలక సాధ నంగా పరిణామం చెందింది.ప్రపంచ వ్యాప్తం గా సుమారు 4.95 బిలియన్ల ప్రజలు సోషల్‌ మీడియాను చురుకుగా ఉపయోగిస్తు న్నారు. సగటు వినియోగదారుడు ప్రతీ రోజూ సోషల్‌ నెట్‌వర్క్‌లలో సుమారు 2 గంటల 27 నిమిషాలు గడుపుతున్నట్లు అంచనా.


కనెక్ట్‌ కాని రంగమంటూ ఏదీ లేదు...

వ్యక్తిగతంగా, వ్యవస్థాగతంగా సోషల్‌ మీడి యాకు కనెక్ట్‌ కాని రంగమంటూ ఏదీ లేదు. ఇందులో వ్యక్తి, కుటుంబం, సమాజం, విద్య, వైద్యం, వ్యాపారం, సమాచారం, ప్రకృతి, భూత, భవిష్యత్‌, వర్తమానాలు, చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలు, సేవలు, మధుర స్మృతులు, స్పందనలు, ప్రతి స్పందనలు, సంఘటనలు వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకు నేదాకా సోషల్‌ మీడియా జీవితంలో అంతర్భాగం అయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

భూపాలపల్లి జిల్లాలో లోటు వర్షపాతం

జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 12:16 PM