ఎనిమిది కేజీల బంగారానికి సమానమైన నగదును కట్టండి: సుప్రీంకోర్టు..
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:00 PM
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.27 కోట్ల విలువైన గోల్డ్ డీల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదంలో ఉన్న 8 కేజీల బంగారం విలువకు సమానమైన నగదును ఉన్నత న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని నిందితుడికి స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.27 కోట్ల విలువైన గోల్డ్ డీల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదంలో ఉన్న 8 కేజీల బంగారం విలువకు సమానమైన నగదును ఉన్నత న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని నిందితుడికి స్పష్టం చేసింది. 36 కేజీల బంగారం ఒప్పందంలో భాగంగా డబ్బులు తీసుకుని కేవలం 27 కేజీల బంగారమే ఇచ్చారని, మిగిలిన 8 కేజీల బంగారాన్ని ఎగ్గొట్టారని ఆరోపిస్తూ గతంలో ఓ వృద్ధుడిపై మోసం కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపై ఇవాళ (మంగళవారం) విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఒప్పందం జరిగిన సమయంలో ఉన్న మార్కెట్ ధర ప్రకారమే 8 కేజీల బంగారం విలువను లెక్కించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ మొత్తాన్ని మూడు వారాల్లోగా కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అదే సమయంలో 70 ఏళ్ల ఆ వృద్ధుడికి అరెస్ట్ నుంచి షరతులతో కూడిన తాత్కాలిక రక్షణ కల్పించింది. మరోవైపు, 8 కేజీల బంగారం విలువకు సమానమైన నగదును కోర్టులో డిపాజిట్ చేసేందుకు సిద్ధమని ధర్మాసనానికి నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. నగదు డిపాజిట్ చేయడంలో విఫలమైతే అరెస్ట్ రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. కాగా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
సింధూ జలాలను నియంత్రిస్తున్న చేతులను ఇస్లామాబాద్ నరికేస్తుంది: పాక్ మంత్రి వ్యాఖ్యలు
ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..