భూపాలపల్లి జిల్లాలో లోటు వర్షపాతం
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:30 AM
భూపాలపల్లి జిల్లాలో వర్షం అంతంతమాత్రమే కురుస్తోంది. అడపాదడప తప్ప సమృద్ధిగా వాన కురిసింది లేదు.
జూన్‌లో సగటు కన్నా 32 శాతం తక్కువ
కాటారం(భూపాలపల్లి): జయశంకర్): భూపాలపల్లి జిల్లాలో వర్షం అంతంతమాత్రమే కురుస్తోంది. అడపాదడప తప్ప సమృద్ధిగా వాన కురిసింది లేదు. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో హెచ్చు తగ్గులతో 32శాతం లోటు వర్ష పాతం రికార్డు అయ్యింది. జూన్‌లో కాటారం మండ లంలో 33 వర్షపాతం తక్కువగా నమోదైంది. రేగొండ మండలం సాధారణం కన్నా 23శాతం సగటు అధిక వర్షపాతంతో టాప్‌లో నిలిచింది. జిల్లాలోని 11మండలాల్లోనూ సాధారణ వర్షాపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి.
జిల్లాలో జూన్‌లో 1690.8 మి.మీ సాధారణ వర్షపాతానికి 32శాతం లోటుతో 1142.6మి.మీ నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గణపురం మండ లంలో 143.7 మి.మీ సగటు వర్షపాతానికి 68.8 వర్షపాతంతో 52శాతం తీవ్ర లోటుతో జిల్లాలోనే అత్యల్పంగా రికార్డు అయ్యింది. గణపురం, మండలంలో అత్యల్పంగా ఈనెలలో ఏడు రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. మహాముత్తారం మండలంలో 11, రేగొండ, చిట్యాల మండలాల్లో 10 రోజులు వర్షాలు కురిశాయి. కాటారం మండలంలో జూన్‌లో 141.2మి.మీ సాధారణ వర్ష పాతం కాగా 94.6మి.మీ నమోదైంది.
ఇక్కడ ఎనిమిది రోజు ల్లో మాత్రమే వర్షాలు కురి సినట్లు రికార్డులు చెపుతున్నాయి. రేగొండ మండలం 23శాతం అధిక వర్ష పాతంతో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. 52శాతం లోటుతో గణపురం మండలం చివరి స్థానంలో ఉంది. కాటారం మండలంలో 33శాతం లోటు వర్ష పాతం, మహదేవపూర్ మండలంలో 48, పలిమెల మండలం 30 , మహా ముత్తారం 32, మల్హర్ 34, చిట్యాల 26, టేకుమట్ల 38, భూ పాలపల్లి మండ లంలో 40, మొగుళ్లపల్లి మండలం 43శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు మాదాపూర్‌లో ట్రాఫిక్ మళ్లింపు
జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News