Share News

అల్లంతో హై బీపీకి చెక్

ABN , Publish Date - Jun 30 , 2026 | 10:41 AM

ఆహారంలో వినియోగించే అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైబీపీని నియంత్రించడంలో ఇది చక్కగా సాయపడుతుందన్నారు.

అల్లంతో హై బీపీకి చెక్

ఇంటర్నెట్ డెస్క్: ఆహారంలో వినియోగించే అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైబీపీని నియంత్రించడంలో ఇది చక్కగా సాయపడుతుందన్నారు. అలాగే అనేక అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.


అల్లం వాడడం వల్ల..

అల్లంలో అనేక జీవక్రియశీల సమ్మేళనాలు(Bioactive compounds) ఉంటాయి. ఇవి హైబీపీని సాధారణ స్థితికి తీసుకురావడానికి దోహదపడతాయి. అల్లంలో జింజెరోల్, షాగావోల్ తదితర సమ్మేళనాలు ఉంటాయి. అదే విధంగా వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. అల్లం తినడం వల్ల రక్తనాళాలు సాధారణ స్థితికి వస్తాయి. తద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటం సహా హైబీపీ సమస్యను తగ్గిస్తుంది.


ఇతర వ్యాధులకు చెక్..

అల్లంలో వాపు నిరోధక గుణాలు ఉంటాయి. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల శరీరంలోని హానికరమైన విష పదార్థాలతోపాటు వ్యర్థాలనూ తొలగిస్తాయి. కీళ్లు, కండరాలలో నొప్పి ఉంటే.. అల్లం తీసుకోవడం వల్ల ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గును తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పని చేస్తుంది. అల్లంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవడం సహా వైరల్, సీజనల్ ఇన్ఫెక్షన్ల‌ను నివారించవచ్చు.


గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదు.


ఈ వార్తలు కూడా చదవండి..

టాబ్లెట్‌పై గీత ఎందుకు ఉంటుంది? దాని ఉపయోగం మీకు తెలుసా?

వీకెండ్‌ థెరపీ.. ఉపశమనం కోసం వెల్‌నెస్‌ సెంటర్లకు

For More Health News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 11:08 AM