Share News

రామగుండం బీ-థర్మల్‏పై వీడనున్న చిక్కులు

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:45 PM

పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టనున్న 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంపై చిక్కుముడి వీడ లేదు.

రామగుండం బీ-థర్మల్‏పై వీడనున్న చిక్కులు
Ramagundam thermal power project

  • 800 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం

  • సింగరేణి సంస్థ ముందుకు వచ్చినా.. అడ్డుకున్న జెన్‌కో

  • ఎన్టీపీసీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టనున్న 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణంపై చిక్కుముడి వీడ లేదు. అసలు ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం మేరకు విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం అవు తుందా లేదా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్‌ను నిర్మించినట్లయితే ఈ ప్రాంతంలో గల నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్లాంట్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం నేరుగా చేపట్టేందుకు కావాల్సిన బడ్జెట్‌ లేకపోవడంతో ఆయా సంస్థలపై ఆధారపడాల్సి వస్తున్నది. వాస్తవానికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెరుగు తున్న నేపథ్యంలో థర్మల్‌ విద్యుత్‌కు డిమాండ్‌ తగ్గుతున్నది.


రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఉత్ప త్తి అవుతున్న 2,600 మెగావాట్ల విద్యుత్‌ను డిమాండ్‌ లేక పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయ లేక పోతున్నది. అయితే ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులను ఎన్టీపీసీ సంస్థకే అప్పగించాలనే నిర్ఝయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించినట్లు సమా చారం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తక్కువ సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్లను మూసివేయాలని సీఈఏ (కేంద్ర పర్యావరణ సంస్థ) తీసుకున్న నిర్ణయం మేరకు రెండేళ్ల క్రితం రామగుండంలో ఇదివరకే గల 62.5 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ మూసివేసిన విషయం తెలిసిందే. ఇక్కడ పని చేసిన ఉద్యోగుల ను మరో చోటికి బదిలీ చేశారు. ఎప్పటి నుంచో ఈ కేంద్రాన్ని 800 మెగావాట్ల సామర్థ్యానికి పెంచి కొత్త ప్లాంట్‌ను నిర్మిం చాలని డిమాండ్‌ వస్తున్నది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ బీ-థర్మల్‌ కేంద్రాన్ని విస్తరించి 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.


ఆ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడంతో ప్రభుత్వం అనుకూలత వ్యక్తం చేసింది. కేబినెట్‌ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం కూడా పొందింది. మొదట ఈ ప్లాంట్‌ను సింగరేణి సంస్థ భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీని ని జెన్‌కో సంస్థతో పాటు అందులో పని చేసే కార్మికులు వ్యతి రేకించారు. తామే నిర్మాణం చేపడతామని జెన్‌కో ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం అందుకు అంగీకరించ లేదు. బొగ్గు సర ఫరా చేసిన సింగరేణి సంస్థకు కోట్ల రూపాయలు జెన్‌కో సంస్థ బకాయి పడింది. ప్లాంట్‌ నిర్మాణానికి 10,893 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేశారు. అంత బడ్జెట్‌తో జెన్‌కో నిర్మించే పరిస్థితిలో లేదని ప్రభుత్వం అందుకు అంగీకరించ లేదు.


ఎన్టీపీసీకి అప్పగించేందుకు యత్నాలు..

రామగుండం బీ-థర్మల్‌ కేంద్రాన్ని నిర్మించే బాధ్యతను ఎన్టీపీసీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం 4000 మెగావాట్ల సామర్థ్యంతో (800 మెగావాట్ల చొప్పున 5 యూనిట్లు) సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ఎన్టీపీసీ ద్వారా రామగుండంలో నిర్మించాలని చట్టంలో పేర్కొ న్న విషయం తెలిసిందే. ఆ మేరకు టీఎస్‌టీపీపీ కేంద్రాల నిర్మా ణాలను చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో 1600 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు కోసం పీపీఏ చేసు కోవడంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మా ణాన్ని ఎన్టీపీసీ చేపట్టి పూర్తి చేసింది.


rgm1.jpgవాటి ద్వారా ఏడాదిన్నర కాలంగా విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ పీపీఏ కుదుర్చు కోలేదు. పగటి వేళల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెద్ద ఎత్తున అవుతుండడంతో ఎక్కువగా దానినే ఉపయోగించు కుంటున్నారు. సోలార్‌ విద్యుత్‌ సరఫ రాను తక్కువకే ఇస్తున్నారు. థర్మల్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ కొను గోలు చేయాలంటే ఆర్థిక భారం పడు తుందని భావించిన ప్రభుత్వం పీపీఏ చేసుకోలేదు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆరు మాసాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌టీపీపీ ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్‌ కొను గోలుకు ఒప్పందం చేసుకున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న రామగుండం బీ-థర్మల్‌ ప్రాజెక్టును ఎన్టీపీసీ చేపట్టే విధంగా ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నది.


దీంతో ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగవు తాయని ప్రభుత్వ భావిస్తున్నది. ఎలాగూ టీఎస్‌టీపీపీలో 800 మెగావాట్లకు పీపీఏ చేసుకున్నందున, అక్కడ కాకుండా రామగుండం బీ-థర్మల్‌ స్థలంలోనే ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఎన్టీపీసీ అధికారులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న ట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల ఎన్టీపీసీ కార్పొరేట్‌ బృందం రామగుండం బీ-థర్మల్‌ స్థలాన్ని పరిశీలిం చారని సమాచారం. కానీ ఎన్టీపీసీ ఇందుకు అంగీకరిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొన్నది. ఒకవేళ ఎన్టీపీసీ సంస్థ బీ-థర్మల్‌ చేపట్టేందుకు ముందుకు వస్తే మాత్రం వెంటనే టెండర్లు నిర్వహించి పనులు చేపట్టే అవకాశాలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వర క్షేత్రానికి కొత్త రూపు

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 12:45 PM