Share News

కిమ్స్‌ ఆస్పత్రికి డిప్యూటీ సీఎం పవన్.. బాధితులకు పరామర్శ

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:27 PM

విశాఖ కిమ్స్ ఆస్పత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు.

కిమ్స్‌ ఆస్పత్రికి డిప్యూటీ సీఎం పవన్.. బాధితులకు పరామర్శ
Pawan Kalyan

విశాఖపట్నం, జూన్ 9: విశాఖ కిమ్స్ ఆస్పత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈరోజు(మంగళవారం) ఉదయం కిమ్స్‌కు చేరుకున్న పవన్.. బాధితులను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


Pawan Kalyan

వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

kims-pawan2.jpg


ఇవి కూడా చదవండి..

స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం: మంత్రి వాసంశెట్టి సుభాశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు మంత్రి లోకేశ్ పరామర్శ

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 12:31 PM