Share News

తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళలపై మాట్లాడటం విడ్డూరం: సానా సతీశ్

ABN , Publish Date - Jun 09 , 2026 | 09:36 AM

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళలపై మాట్లాడటం విడ్డూరం: సానా సతీశ్
Sana Satish

అమరావతి, జూన్ 9: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు సానా సతీశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా 11 మందికి రాజ్యసభ ఇచ్చిన జగన్.. ఒక్క మహిళకైనా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకంటూ మంత్రి నారా లోకేశ్.. మహానాడు వేదికగా చేసిన ప్రకటనపై దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.


తల్లిని విశాఖలో ఓడించి, పార్టీ సభలో రాజీనామా చేయించిన జగన్.. మహిళలపై అబద్ధపు పత్రికలో విషప్రచారం చేయిస్తున్నారంటూ దుయ్యబట్టారు. తల్లి, చెల్లినే మోసం చేసినప్పుడు జగన్‌కు మహిళలు గుర్తుకు రాలేదా అంటూ సానా సతీశ్ ప్రశ్నలు సంధించారు.


ఇవి కూడా చదవండి..

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

రాజీనామా చేయాల్సిందే

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 09:36 AM