నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:30 AM
బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినప్పటినుంచి బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత నెలలో 1,70,000 వద్ద ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ఇప్పటి వరకు దాదాపు 19 వేల రూపాయలు తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు పిలుపునిచ్చినప్పటినుంచి బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత నెలలో 1,70,000 వద్ద ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ఇప్పటి వరకు దాదాపు 19 వేల రూపాయలు తగ్గింది. ఈ రోజు (మంగళవారం) కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గింది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,51,680 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,29,040 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,13,600 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
తగ్గిన వెండి ధరలు ..
గత కొద్దిరోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు.. కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 26,900 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,69,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
స్టీల్ ప్లాంట్‌లో ఏం జరిగిందంటే..
పల్లా భావోద్వేగం.. కన్నీటి పర్యంతం