Share News

స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం: మంత్రి వాసంశెట్టి సుభాశ్

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:46 AM

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పరామర్శించారు. షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి పరామర్శించి.. వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.

స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం: మంత్రి వాసంశెట్టి సుభాశ్
Vasamsetti Subhash

విశాఖపట్నం, జూన్ 9: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాద ఘటనలో గాయపడిన వారిని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పరామర్శించారు. ఈరోజు(మంగళవారం) ఉదయం షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి పరామర్శించి.. వారి ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమైనదన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించానని.. మెరుగైన వైద్య చికిత్స అందుతోందని తెలిపారు.


ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు... గాయపడిన వారికి పది లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు చెప్పారు. కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రమాద ఘటన జరిగినప్పుడు కార్మికులు అవసరమైన సంఖ్యలోనే ఉన్నారని వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌లో క్రమం తప్పకుండా తనిఖీలు జరిగాయన్నారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రాజీనామా చేయాల్సిందే

తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళలపై మాట్లాడటం విడ్డూరం: సానా సతీశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 10:51 AM