Share News

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:10 PM

ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం రేపింది.

సంగారెడ్డి జిల్లాలో మొసలి పిల్లల కలకలం
Crocodile, Sangareddy

  • పంట పొలాల్లో 20 పిల్లలు, 60 గుడ్లు ప్రత్యక్షం

  • మంజీరా సంరక్షణ కేంద్రానికి పిల్లలు, గుడ్ల తరలింపు

సదాశివపేట(సంగారెడ్డి): ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో సోమవారం కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం రేపింది. గ్రామ శివారులో పశువులను కాసేందుకు వెళ్లిన పశువుల కాపరులకు 20 మొసలి పిల్లలు కనిపించాయి. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్టు అధికారులు మొసలి పిల్లలను పట్టుకున్నారు. అనంతరం సమీప ప్రాంతంలో దాదాపు 60 మొసలి గుడ్లను గుర్తించారు.


croco.jpgమొసలి పిల్లలను, మొసలి గుడ్లను సంగారెడ్డి సమీపంలోని మంజీరా అభయారణ్యంలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాగా సమీపంలోని చెరువులు, మెలిగిరిపేట ప్రాజెక్టులో నీటిలో పెద్ద మొత్తంలో మొసళ్లు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. దాదాపు 20కి పైగా మొసలి పిల్లను, 60 మొసలి గుడ్లను అటవీశాఖ అధికారులు తరలించడంతో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఊపిరిపీల్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వర క్షేత్రానికి కొత్త రూపు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 12:10 PM