Share News

కొత్త జంటకు వంట తంటాలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:58 AM

మిడిల్‌ ఈస్ట్‌ యుద్ధం మంటలు ’వంట’ తంటాలు తెచ్చిపెట్టాయి. మూడు నెలలుగా కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు బంద్‌ అయ్యాయి.

కొత్త జంటకు వంట తంటాలు
LPG gas connection

  • కొరత పేరిట డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వని డీలర్లు

  • ప్రదక్షిణలు చేస్తున్న వినియోగదారులు

  • సింగిల్‌ సిలిండర్‌కు కూడా నో ఛాన్స్‌

  • సరిపడా సరఫరా లేదని చెబుతున్న డీలర్లు

  • మిడిల్‌ ఈస్ట్‌ వార్‌ ప్రభావం

హనుమకొండ సిటీ: మిడిల్‌ ఈస్ట్‌ యుద్ధం మంటలు ’వంట’ తంటాలు తెచ్చిపెట్టాయి. మూడు నెలలుగా కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు బంద్‌ అయ్యాయి. గతంలో ఒక్క రోజులో నే కొత్త గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు ఉండేది. డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్‌ కూడా వెనువెంటనే దొరికేది. ఇప్పుడా పరిస్థితి మారింది. కొత్త కనెక్షన్ల బుకింగ్‌ లు నిలిచాయి. ఏ ఎల్‌పీజీ డీలర్‌ చుట్టూ తిరిగినా ఇప్పుట్లో లేవంటున్నారు. ఎప్పుడు అని అడిగితే చె ప్పలేం అంటున్నారు. ఈ క్రమంలో నూతన గ్యాస్‌ కనెక్షన్లను ఆశించే వారు నెలల తరబడి నిరీక్షిస్తున్నారు.


కొత్త జంటలకు తంటా

నూతన వివాహ జంటలకు గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ ఛాలెంజింగ్‌గా మారింది. పెళ్లయిన వారు వేరు కాపురం పెడుతున్నారు. ఇక పని చేసే చోట భార్యతో కొత్త జీవితం ఆరంభించాలని అనుకునే భర్తకు వంట భయాన్ని కలిగిస్తోంది. బ్యాచిలర్‌ లైఫ్‌లో ఆన్‌లైన్‌ ఆర్డర్‌ లేదా హోటళ్లలో కడుపు నింపేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు భార్య చేతి వంటతో హమ్మయ్య అనుకుందా మంటే, కొత్త గ్యాస్‌ సిలిండరే దొరకని పరిస్థితిలో నూతన దంపతులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు,


hnk1.jpgఅత్త మామాలకు తలనొప్పిగా మారింది. కొందరు అల్లుళ్లు గ్యాస్‌ సమస్య తీరితేనే వేరు కాపురం అని అంటుండగా....ఇంకొందరు వారి గ్యాస్‌ సిలిండర్‌ను కానుకగా ఇవ్వండని...లేదా కనీసం సింగిల్‌ సిలిండర్‌ అయినా అడ్జస్ట్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నూతన వధూవరుల వంట కష్టాలు చెప్పజాలనివిగా మారాయి. స్టౌవ్‌ కొనుగోలు చేసినా సిలిండర్‌కు గ్యాస్‌ కనెక్షన్‌ లేకపోవడంతో వారికి...నిజంగా అంతర్జాతీయ సమస్యగానే పరిణమించింది. మరో వైపు ప్రత్యామ్నాయ మార్గంగా ఇండక్షన్‌ స్టౌవ్‌ల వైపు చూసినా...మార్కెట్లో వెను వెంటనే దొరకని పరిస్థితి నెలకొంది.


డీలర్ల చుటూ ప్రదక్షిణలు

ఎల్‌పీజీ డీలర్ల చుట్టూ కొత్త గ్యాస్‌ కనెక్షన్ల కోసం ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరు గుతూనే ఉంది. డీలర్లు పాత కనెక్షన్ల పరిస్థితి క్లిష్టంగా ఉందని, ఇప్పట్లో కొత్త కనెక్షన్ల మంజూరీ లేనే లేదని తెగేసి చెబుతున్నారు. ఇంకా ఎంత కాలం ఇలా ఉంటుందో కూడా తెలియదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో డీలర్లను వేడుకుంటు న్నారు. సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్‌ కూడా దొరకదని డీలర్లు చెబుతుండడంతో జనం నిరాశతో వెనుదిరు గుతున్నారు. బ్లాక్‌లో అధిక ధర వెచ్చిస్తామంటున్నారు జనం. కానీ కనెక్షన్ల నిలిపివేత ఉన్న క్రమంలో ఎక్కడి నుంచి వస్తాయంటున్నారు డీలర్లు. ప్రస్తుత కస్టమర్లకే సిలిండర్‌ సక్రమంగా సరఫరా చేసే పరిస్థితి లేదంటు న్నారు. కొత్త కనెక్షన్ల మాట ఇప్పట్లో మరిచిపోవాల్సిం దేనని కరాకండిగా చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 09 , 2026 | 10:58 AM