Share News

హాలీవుడ్ సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ.. 37 ఏళ్ల మహిళ 12 ఏళ్ల బాలికలా..

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:26 AM

అచ్చం ‘ఆర్ఫన్’ సినిమాను తలపించేలాంటి ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఓ నేరస్తురాలు బాలికలా నాటకమాడింది. ఓ కుటుంబం ఆమెను దత్తత తీసుకునేలా చేసింది. అయితే, ఆమె ప్లాన్ కొన్ని రోజుల్లోనే బెడిసికొట్టింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

హాలీవుడ్ సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ.. 37 ఏళ్ల మహిళ 12 ఏళ్ల బాలికలా..
Brazil adoption scam

ఇంటర్‌నెట్ డెస్క్: హాలీవుడ్‌లో ‘ఆర్ఫన్’ అనే సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఓ జంట 9 ఏళ్ల బాలికను దత్తత తీసుకుంటుంది. ఆ బాలిక ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత దారుణమైన సంఘటనలు జరుగుతుంటాయి. హీరోయిన్‌కు బాలిక మీద అనుమానం వస్తుంది. బాలిక గురించి ఎంక్వైరీ చేస్తే షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తమ ఇంట్లో ఉన్నది బాలిక కాదని, 33 ఏళ్ల మహిళ అని తెలుస్తుంది. అచ్చం ‘ఆర్ఫన్’ సినిమాను తలపించేలాంటి ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఓ నేరస్తురాలు బాలికలా నాటకమాడింది.
brazil-woman.jpg


ఓ కుటుంబం ఆమెను దత్తత తీసుకునేలా చేసింది. అయితే, ఆమె ప్లాన్ కొన్ని రోజుల్లోనే బెడిసికొట్టింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శాంటా క్యాతరీనాకు చెందిన అమాండా మారియా సౌజా డీ ఒలివెరా అనే 37 ఏళ్ల మహిళ ‘ఆర్ఫన్’ సినిమా స్టైల్లో మోసానికి తెరతీసింది. చర్చి సంఘాలు, వాలంటీర్ల ద్వారా కుటుంబాలకు పరిచయం అయ్యేది. తనను తాను 12 ఏళ్ల బాలికగా పరిచయం చేసుకునేది. వారి ముందు చిన్న పిల్లలా ప్రవర్తించేది. ‘నీ ఆకారం 12 ఏళ్ల బాలికలా లేదు ఎందుకు?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే..
brazil-news.jpg


చిన్నప్పుడు ఎదురైన దారుణమైన సంఘటనల కారణంగా చిన్న వయసులోనే పెద్ద మనిషిలా కనిపిస్తున్నానని చెప్పేది. వారు ఆమె మాటలు నమ్మేవారు. కొద్దిరోజుల క్రితం ఓ కుటుంబం ఒలివెరాను దత్తత తీసుకుంది. ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి ఒలివెరా మీద అనుమానం వచ్చింది. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయగా ఒలివెరా ఓ దొంగ అని తేలింది. ఆమెపై బ్రెజిల్ వ్యాప్తంగా చాలా కేసులు ఉన్నాయని వెల్లడైంది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశాడు. ఆమెపై ఫ్రాడ్, ఐడెంటిటీ థెఫ్ట్ మీద కేసులు నమోదు అయ్యాయి.


ఇవి కూడా చదవండి

SIPతో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా ?

తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళలపై మాట్లాడటం విడ్డూరం: సానా సతీశ్

Updated Date - Jun 09 , 2026 | 11:57 AM