SIPతో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా ?
ABN , Publish Date - Jun 09 , 2026 | 09:52 AM
సిప్ రూపంలో చాలా మంది పెట్టుబడి ఎక్కువగా పెడుతుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సిప్ చేస్తే.. కొన్నేళ్లలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు SIPతో రూ.10 కోట్లు సంపాదించడం ఎలానో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పెట్టుబడుల్లో సమయం అత్యంత కీలకం. ఎంత త్వరగా పెట్టుబడులు ప్రారంభిస్తే, అంత తక్కువ మొత్తంతోనే పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో సగటున 12 శాతం వరకు రాబడిని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంచనాల ఆధారంగా, నెలకు రూ.10,000, రూ.25,000 లేదా రూ.50,000 SIP చేస్తే రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం..
నెలకు రూ.10,000 SIP
ప్రారంభ SIP: రూ.10,000
ప్రతి ఏడాది SIP పెంపు (Step-Up): 10%
అంచనా రాబడి: 12%
పెట్టుబడి కాలం: 31 సంవత్సరాలు
ఈ విధంగా పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి సుమారు రూ.2.18 కోట్లు అవుతుంది. చక్రవడ్డీ ప్రభావంతో రాబడులు సుమారు రూ.8 కోట్లకు చేరి, మొత్తం కార్పస్ రూ.10 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉంటుంది.
నెలకు రూ.25,000 SIP
ప్రారంభ SIP: రూ.25,000
ప్రతి ఏడాది SIP పెంపు: 10%
అంచనా రాబడి: 12%
పెట్టుబడి కాలం: 25 సంవత్సరాలు
ఈ ప్రణాళికలో మొత్తం పెట్టుబడి సుమారు రూ.2.95 కోట్లు అవుతుంది. రాబడులు దాదాపు రూ.7.74 కోట్ల వరకు చేరి, మొత్తం సంపద రూ.10.68 కోట్లకు చేరే అవకాశం ఉంటుంది.
నెలకు రూ.50,000 SIP
ప్రారంభ SIP: రూ.50,000
ప్రతి ఏడాది SIP పెంపు: 10%
అంచనా రాబడి: 12%
పెట్టుబడి కాలం: 20 సంవత్సరాలు
ఈ సందర్భంలో మొత్తం పెట్టుబడి సుమారు రూ.3.44 కోట్లు అవుతుంది. రాబడులు రూ.6.50 కోట్ల వరకు పెరిగి, మొత్తం కార్పస్ దాదాపు రూ.10 కోట్లకు చేరుతుంది.
స్టెప్-అప్ SIP ఎందుకు ముఖ్యం?
స్టెప్-అప్ SIPలో ప్రతి సంవత్సరం పెట్టుబడి మొత్తాన్ని కొంత శాతం పెంచుకుంటూ వెళ్తారు. జీతం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని కూడా పెంచడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
రూ.10,000 SIPతోనైనా, రూ.50,000 SIPతోనైనా రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే. అయితే దానికి పట్టే సమయం మారుతుంది. క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించడం, దీర్ఘకాలం ఓపికగా ఉండటం, SIP మొత్తాన్ని కాలక్రమేణా పెంచుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు.
గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. గత రాబడులు భవిష్యత్తులో కూడా వస్తాయని హామీ లేదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..