Share News

గోల్డ్ రేట్స్ యూటర్న్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:27 AM

భారత్‌లో బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

గోల్డ్ రేట్స్ యూటర్న్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు
Gold, Silver Rates on Jun 9 in India

ఇంటర్నెట్ డెస్క్: గత వారం రోజులుగా భారత్‌లో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడంతో భారత్‌లోనూ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జూన్ 9) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,160కు ఎగబాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర ఏకంగా రూ.1,470ల మేర పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,350ల మేర పెరిగి రూ.1,40,400కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ధర రూ.2.7 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


దేశవ్యాప్తంగా పసిడి ధరలు సగటున రూ.1,450ల మేర పెరిగాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,000కు పెరిగింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,160గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,53,310కు ఎగబాకగా, ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,40,550కు పెరిగింది. దేశంలో వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.6 లక్షల నుంచి రూ.2.7 లక్షల మధ్య ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోలిస్తే 0.6 శాతం మేర పెరిగి 4,330 డాలర్లను దాటింది. ఔన్స్ వెండి మాత్రం మాత్రం 1 శాతం మేర తగ్గి 67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగల కొనుగోలు సమయంలో మరోసారి ధరల గురించి కనుక్కోవాల్సి ఉంటుంది.

ఈ వార్తలనూ చదవండి:

SIPతో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా ?

కుటుంబ పొదుపు, సంపద సృష్టికి క్యాపిటల్‌ మార్కెట్లు కీలకం: సెబీ చైర్మన్

Updated Date - Jun 09 , 2026 | 10:35 AM