అడిగి మరీ మసాజ్ చేయించుకున్న ఏనుగు.. వైరల్ వీడియో
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:25 AM
మావటిని అడిగి మరీ మసాజ్ చేయించుకున్న ఓ క్యూట్ ఏనుగు వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇతర జంతువులతో పోలిస్తే ఏనుగుల్లో భావోద్వేగాలు ఎక్కువని నిపుణులు చెబుతుంటారు. ఏనుగులను దగ్గరగా గమనించే వారెవరికైనా ఇది అనుభవంలోకి వస్తుంది. ముఖ్యంగా మావటిలతో అవి గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక ఏనుగు మావటిని అడిగి మరీ కాలికి మసాజ్ చేయించుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మసాజ్ ఎంజాయ్ చేస్తున్న ఏనుగును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
కుంభకోణంలోని (తమిళనాడు) అరుళ్‌మిగు ఆదికుంభేశ్వర దేవాలయంలో ఈ ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను @lifewshroots ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. నుదుటన తిలకం, పూల దండతో పాటు మెడ చుట్టూ గంటలతో ఉన్న ఏనుగు తన పక్కనే ఉన్న మావటిని అడిగి మరీ కాలికి మసాజ్ చేయించుకుంది.
మొదట ఒకకాలిని మావటి వైపు చాపగానే అతడు కాలుపై ఒత్తుతూ కాసేపు మసాజ్ చేశాడు. ఆ తరువాత ఏనుగు రెండో కాలును కూడా అతడివైపు చాపి మసాజ్ చేయించుకుంది. మసాజ్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఏనుగు వీడియోలో ప్రశాంతంగా కనిపించింది. ‘భారీ ఏనుగే అయినా గున్న ఏనుగులా మసాజ్‌ను ఎంజాయ్ చేస్తోంది’ అన్న క్యాప్షన్‌తో ఒక వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు.
ఇక ఈ వీడియోకు జనాల నుంచి భారీగా స్పందన వచ్చింది. 15 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. వందల కొద్దీ కామెంట్స్ చేస్తూ జనాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతకు మించిన క్యూట్ వీడియో ఈ మధ్య ఎప్పుడూ చూడలేదు అని అనేక మంది కామెంట్ చేశారు. ప్రపంచంలోని అడవి ఏనుగుల్లో 60 శాతం భారత్‌లోనే ఉన్న విషయం తెలిసిందే.
హనీమూన్‌కు భర్తతో పాటు అత్తమామలు! యువతికి తిక్కరేగడంతో..
భయానక దృశ్యం.. ఇంటి వాటర్ ట్యాంకులో 27 పాములు