Share News

భయానక దృశ్యం.. ఇంటి వాటర్ ట్యాంకులో 27 పాములు

ABN , Publish Date - Jun 09 , 2026 | 07:51 AM

ఓ ఇంటి వాటర్ ట్యాంకులో పెద్ద మొత్తంలో పాములు వెలుగుచూసిన ఘటన హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 27 పాములు వాటర్ ట్యాంకులో కనిపించాయి.

భయానక దృశ్యం.. ఇంటి వాటర్ ట్యాంకులో 27 పాములు
Haridwar snake rescue

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ ఇంటి వాటర్ ట్యాంకులో పెద్ద మొత్తంలో పాములు వెలుగుచూసిన ఘటన హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 27 పాములు వాటర్ ట్యాంకులో కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు కూడా భయపడిపోయారు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమచారంతో స్నేక్ రెస్క్యూయర్లు ఇంటి దగ్గరకు వచ్చారు. పాములను సురక్షితంగా అక్కడినుంచి పట్టుకెళ్లిపోయారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సరాయ్ గ్రామానికి చెందిన ఓ ఇంటి ఆవరణలో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది.


కుటుంబసభ్యులు చాలా కాలం నుంచి ఆ వాటర్ ట్యాంకును వాడటం లేదు. దీంతో ట్యాంకులో పెద్ద మొత్తంలో చెత్త, బురద పేరుకుపోయాయి. సోమవారం ఆ ఇంటి వ్యక్తి ట్యాంకు దగ్గరకు వెళ్లాడు. ట్యాంకులో పెద్ద సంఖ్యలో పాములు ఉండటం చూసి షాక్ అయ్యాడు. మిగిలిన కుటుంబసభ్యులకు వెంటనే విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు.. స్నేక్ రెస్క్యూయర్లు తాలిబ్, భోలాలతో ఇంటి దగ్గరకు చేరుకున్నారు. స్నేక్ రెస్క్యూయర్లు 27 పాములను ట్యాంకు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వాటిని ఓ డబ్బాలో వేసుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.


స్నేక్ రెస్క్యూయర్లు మీడియాతో మాట్లాడుతూ.. ‘అవి నీటి పాములు. వాటికి విషం ఉండదు. చెరువులు, నదులు, కాల్వలు, కొలన్ల దగ్గర కనిపిస్తుంటాయి. అవి కప్పలు, చేపలు, చిన్నచిన్న కీటకాలను తిని జీవిస్తాయి’ అని తెలిపారు. అయితే, ఆ పాములు ట్యాంకులోకి ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. పాములకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

Updated Date - Jun 09 , 2026 | 07:59 AM