Share News

వీధి వ్యాపారుల పెన్నిధి.. పీఎం స్వనిధి

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:57 AM

రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం అండగా మారుతోంది.

వీధి వ్యాపారుల పెన్నిధి.. పీఎం స్వనిధి
PM SVANidhi Scheme

  • పూచీకత్తు అవసరం లేకుండానే రుణం

  • సకాలంలో చెల్లిస్తే రూ.50వేల ఆర్థికసాయం

  • క్రెడిట్‌ కార్డులు సొంతం

జమ్మికుంట(కరీంనగర్): రోజువారీ సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం అండగా మారుతోంది. పూచీకత్తు లేకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ చిరు వ్యాపారుల కు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన ఈ పథకాన్ని ఇప్పుడు 2030 మార్చి 31వరకు పొడి గించింది. మెప్మా ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా వేలాది మంది వ్యాపారులు తమ వ్యాపా రాన్ని నిలబెట్టుకోవడంతో పాటు విస్తరించు కునే అవకాశం పొందుతున్నారు.


2,618మంది గుర్తింపు..

జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో 2,618 మంది చిరువ్యాపారులను గుర్తించారు. వీరిలో 344మంది 15వేల రూపాయలు, 1,486మంది 25వేల రూ పాయలు, 768మంది 50వేల రూపా యల చొప్పున రుణాలు తీసుకున్నారు. 20మందికి క్రెడిట్‌ కార్డులు వచ్చాయి. మొదటి విడుతలో 15వేల రూపాయ లు అందిస్తారు. సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండో విడతలో 25వేల రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుంది. రెండో విడత రుణాన్ని నిర్ణీత గడువులో చెల్లించిన వారికి .50వేల రూపాయల వరకు రుణం అందిస్తున్నారు. ఈ విధంగా క్రమశిక్షణతో రుణాలు చెల్లించే వారికి మరింత ఆర్ధిక సహాయం అందేలా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది.


అవగాహన లేకపోవడంతో..

మున్సిపల్‌ పరిధిలో 2,618మంది వీధి వ్యాపారులుగా గుర్తింపు పొందగా, అందులో కేవలం 20మందికి మాత్రమే క్రెడిట్‌ కార్డులు లభించాయి. అర్హులైన వ్యాపారుల్లో చాలా మందికి పథకంపై పూర్తి అవగా హన లేకపోవడం, బ్యాంకు ప్రక్రియలపై సందేహాలు ఉండటం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అధికారు లు అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తే మరింత లబ్ధిపొందే అవకాశం ఉంది.


xxx.jpgఆర్థికంగా నిలదొక్కుకునేలా..

చిన్న మొత్తంలో పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తీసుకునే పరిస్థితిని పీఎం స్వనిధి పథకం గణనీయంగా తగ్గిస్తోంది. అయితే పథకం అసలు లక్ష్యం నెరవేరాలంటే అర్హులైన ప్రతి వీధి వ్యాపారికి గుర్తింపు కార్డు, రుణం, డిజిటల్‌ లావాదేవీలపై అవ గాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. పథకం పొడిగింపుతో ఇంకా వేలాది మంది చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటే చిన్న వ్యాపారాలే పెద్ద విజయాలకు పునాది కావచ్చు.


క్రెడిట్‌ చరిత్రకే ప్రాధాన్యం..

పీఎం స్వనిధి పథకం ప్రత్యేకత రుణం ఇవ్వడంలోనే కాదు, ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడంలోనూ ఉంది. రుణాలను సకా లంలో చెల్లించే వారికి సిబిల్‌ స్కోర్‌ మెరుగు పడుతుంది. దీంతో భవిష్యత్తులో వ్యక్తిగత రుణాలు, ఇతర బ్యాంకు సేవలు పొందడం సులభమవుతుంది. కొందరు అర్హులైన వ్యాపా రులకు క్రెడిట్‌ కార్డులు కూడా మంజూరు అవుతున్నాయి. రుణాలను క్రమం తప్పకుండా చెల్లించే వారికి ఇది అదనపు ప్రయోజనంగా నిలుస్తోంది.


రుణం రావడం సంతోషంగా ఉంది..

  • మహమ్మద్‌ వసీం అక్రమ్‌, జమ్మికుంట

గతంలో పెట్టుబడి కోసం ప్రై వేట్‌ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవల్సి వచ్చేది. పీఎం స్వనిధి పథకం ద్వారా పూచీకత్తు లేకుండా రెండో విడ త 25వేల రూపాయల రుణం రావడంతో వ్యాపారం కొనసాగిం చడం సులభ మైంది. రుణాన్ని సకాలంలో చెల్లిస్తే మరింత ఎక్కు వ మొత్తం రుణం పొందె అవకాశం ఉండటం మాకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇలాంటి పథ కాలపై వీధి వ్యాపారులకు అవగాహన కల్పించాలి. అర్హులందరికీ సులభంగా రుణాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా ట్రైనీ ఐపీఎస్ కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్న ఉమెన్ సేఫ్టీ అధికారులు

హైదరాబాద్‌లో భారీగా ఓట్ల కోత!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 12:00 PM