Share News

వీడియో కాల్‌లో తండ్రికి చివరి వీడ్కోలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 06 , 2026 | 10:54 AM

హర్యానాలో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధాశ్రమంలో కన్నుమూసిన తండ్రికి కుమార్తెలు వీడియో కాల్ ద్వారా చివరి వీడ్కోలు పలికారు..

వీడియో కాల్‌లో తండ్రికి చివరి వీడ్కోలు.. వీడియో వైరల్
Sonipat Old Age Home

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని సోనిపత్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన ముగ్గురు కుమార్తెల చదువు, పోషణ కోసం జీవితాంతం కష్టపడిన శివచరణ్ రామ్ రతన్ గుప్తా అనే వ్యక్తి వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి అయిన గుప్తా.. కొంత కాలం నుంచి సోనిపత్‌లోని వెస్ట్ రామ్ నగర్‌లో సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఆయన భార్య మీనా గతంలోనే మరణించడంతో, వృద్ధాశ్రమమే ఆయనకు చివరి ఆశ్రయంగా మారింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న గుప్తా మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మరణించారు. విషయం తెలుసుకున్న వృద్ధాశ్రమం యాజమాన్యం ఆయన కుమార్తెలకు సమాచారం అందించింది.


నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైలో ఉన్న కుమార్తెలు వెంటనే సోనిపత్‌కు చేరుకోలేకపోయారు. దీంతో వారు వీడియో కాల్ ద్వారా తండ్రి అంత్యక్రియలను వీక్షిస్తూ చివరి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల నిర్వహణ కోసం వారు రూ.5,100 చెల్లించినట్లు సమాచారం. వృద్ధాశ్రమం సిబ్బంది, స్థానిక సమాజ సభ్యుల సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చివరి క్షణాల్లో కుటుంబ సభ్యుల దూరం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు హృదయాన్ని కలచివేస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

హైదరాబాద్‌లో భారీగా ఓట్ల కోత!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 11:25 AM