Share News

ఢిల్లీ డేంజర్‌.. కుట్రల్లో చిక్కుకోవద్దు

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:51 AM

దేశ రాజధాని గురించి ఎన్‌డీఎ రాజ్యసభ ఎంపీలకు ప్రధాని మోదీ జాగ్రత్తలు చెప్పారు. ఢిల్లీ ప్రమాదకర ప్రదేశమన్నారు. లూటియన్స్‌ జోన్‌లో అప్రమత్తంగా ఉండాలని.. కుతంత్రాల వలలో...

ఢిల్లీ డేంజర్‌.. కుట్రల్లో చిక్కుకోవద్దు

  • ఎన్‌డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ జాగ్రత్తలు

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశ రాజధాని గురించి ఎన్‌డీఎ రాజ్యసభ ఎంపీలకు ప్రధాని మోదీ జాగ్రత్తలు చెప్పారు. ఢిల్లీ ప్రమాదకర ప్రదేశమన్నారు. లూటియన్స్‌ జోన్‌లో అప్రమత్తంగా ఉండాలని.. కుతంత్రాల వలలో చిక్కుకోవద్దని సూచించారు. ఎవరిని కలుస్తున్నారో, ఎక్కడ కలుస్తున్నారో మెలకువతో వ్యవహరించాలన్నారు. బుధవారం ఉదయం 37 మంది ఎన్‌డీఏ రాజ్యసభ ఎంపీలతో ఆయన అల్పాహార విందు సమావేశం ఏర్పాటుచేశారు. గంటపాటు భేటీ సాగింది. ఎంపీ లెటర్‌హెడ్‌ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఢిల్లీ రాజకీయాలపై కొన్ని టిప్స్‌ ఇచ్చారు. ఎవరితోనైనా ఫోన్లో గౌరవంగా మాట్లాడాలని అన్నారు. ఈ ఎంపీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, ఆప్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంపీలు కూడా ఉన్నారు. పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరు కావాలని.. నూరు శాతం హాజరు ఉండేలా చూసుకోవాలని.. ప్రతి రోజూ పార్లమెంటు గ్రంథాలయంలో కనీసం ఒకట్రెండు గంటలు గడపాలని సూచించారు. యువతతో మమేకం కావాలని.. ఎంపీలాడ్స్‌ నిధులను నియోజకవర్గాల్లో యువజనులు, క్రీడా కార్యకలాపాలకు ఉపయోగించాలన్నారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 05:51 AM