తెలంగాణ కోసం చివరి శ్వాస వరకూ ఉద్యమించిన మహనీయుడు.. ఆచార్య జయశంకర్: హరీశ్ రావు
ABN , Publish Date - Aug 06 , 2026 | 08:26 AM
తెలంగాణ కోసం చివరి శ్వాస వరకూ ఉద్యమించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ కోసం చివరి శ్వాస వరకూ ఉద్యమించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని అనన్ారు. ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని గణాంకాలు, చారిత్రక ఆధారాలతో దేశానికి చాటి చెప్పిన ఆయన, ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేక తరాలకు స్ఫూర్తిగా నిలిచిన జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గమే తెలంగాణ ఆత్మగౌరవానికి, అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. జయశంకర్ జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరును నామకరణం చేయడంతో పాటు, ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ కోసం అంకితభావంతో పోరాడిన మహనీయుడి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయడమే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ స్వాభిమానం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం జయశంకర్ సార్ కలలు కన్న మార్గంలోనే ముందుకు సాగాలని పిలుపునిస్తూ, "జోహార్ జయశంకర్ సార్" అంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి
వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్
హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్