హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Aug 05 , 2026 | 07:17 AM
హైదరాబాద్‌లోని బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ భీమాలింగప్ప తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్): టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ భీమాలింగప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేపీహెచ్‌బీ ఏడోఫేజ్, అంకుర్ హాస్పిటల్, ఇందూ అపార్ట్‌మెంట్స్, నాలుగోఫేజ్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సర్దార్ నగర్, రాజీవ్‌గాంధీ నగర్, లోధా గేటెడ్ కమ్యూనిటీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ఇంజనీరింగ్‌లో సీట్ల భర్తీ 80శాతమే!
Read Latest AP News And Telangana News And International News And Telugu News