ఇద్దరు జవాన్లను కాల్చిచంపి.. ఆపై ఆత్మహత్య
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:26 AM
అసోంలోని సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్యాంపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన...
ఆంధ్రా సీఆర్‌పీఎఫ్ అధికారి ఘాతుకం.. అసోంలో ఘటన
గువాహటి, ఆగస్టు 4: అసోంలోని సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్యాంపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏఎ్‌సఐ బల్లాని ప్రేమాంబరం విధుల్లో ఉన్న ఇద్దరు సహచర సిబ్బందిని తుపాకీతో కాల్చి చంపి, ఆపై తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మరొక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అసోంలోని నగావ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రేమాంబరం మంగళవారం ఉదయం కతిమరిలోని 34వ బెటాలియన్ క్యాంపు ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి గార్డు రూమ్‌లోని ఇన్‌సాస్ రైఫిల్ తీసుకుని అక్కడే విధుల్లో విష్ణు ప్రసాద్, రామ్‌నవాల్ సింగ్, మానె గోవింద్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విష్ణుప్రసాద్, రామ్‌నవాల్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా.. గోవింద్ తీవ్రంగా గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..