Share News

తమిళనాడులో జెన్‌జీకి ప్రత్యేక పథకాలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:49 AM

దేశంలోనే తొలి ఏఐ సిటీని, ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. టీవీకే ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను...

తమిళనాడులో జెన్‌జీకి ప్రత్యేక పథకాలు

చెన్నై, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలి ఏఐ సిటీని, ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. టీవీకే ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి మరియా విల్సన్‌ బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జెన్‌జీ కోసం పలు ప్రత్యేక పథకాలు ప్రకటించారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని, ప్రయోగశాలను, ఐఏ క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు రూ.5 కోట్లు కేటాయించారు. 11వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లతో పాటు హెల్మెట్లు, వాటర్‌ బాటిళ్లను కూడా అందిస్తామన్నారు. కళాశాలలో చదివే విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు పంపిణీ చేస్తామన్నారు. రూ.90 కోట్ల వ్యయంతో 5 పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వెట్రి నైపుణ్యాభివృద్ధి పథకం ద్వారా 12 లక్షల మంది కాలేజీ విద్యార్థులు, లక్షమంది నిరుద్యోగులకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తామన్నారు. 2031లోగా ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీలలో చదివే 5 లక్షల మంది యువకులకు ఏఐపై శిక్షణ అందిస్తామన్నారు. విద్యుత్‌ వాహనాల మరమ్మతు పనుల కోసం వచ్చే ఐదేళ్లలో 12,500 మంది యువకులకు మెకానిక్‌ శిక్షణ ఇస్తామని చెప్పారు.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 05:49 AM