లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు షాక్
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:34 AM
2013 నాటి లైంగిక దాడి కేసులో తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం దోషిగా నిర్ధారించింది. 2021లో మాపుసా కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం రద్దు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: 2013 నాటి లైంగిక దాడి కేసులో తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం దోషిగా నిర్ధారించింది. 2021లో మాపుసా కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం రద్దు చేసింది. జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సందేకర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పును వెలువరించింది. ఐపీసీలోని సెక్షన్లు 376 (2) (F) 376(2) (K), 354 A, 354 B కింద తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించింది. అతడికి విధించిన శిక్షను ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ధర్మాసనం ప్రకటించనుంది.
గోవా ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. కుమార్తె వయస్సు ఉన్న యువతితో అతడు ఈ విధంగా వ్యవహరించారని తెలిపారు. బాధితురాలు పదే పదే తిరస్కరించినప్పటికి తేజ్‌పాల్ తన ప్రయత్నాలను కొనసాగించాడని పేర్కొన్నారు. అదీకాక మ్యాగజైన్ సంపాదకుడిగా అతడు గౌరవమైన స్థానంలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు తరుణ్ తేజ్‌పాల్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని ఈ సందర్భంగా కోర్టుకు తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు.
గోవాలో లైంగిక దాడి..!
2013లో గోవాలోని ఓ రిసార్ట్ వేదికగా తెహెల్కా పత్రిక థింక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మ్యాగజైన్ సంపాదకుడు తరుణ్ తేజ్ పాల్ తనపై లైంగిక దాడి చేశాడని సహోద్యోగి ఆరోపించారు.
నేను బాధితుడిని: తేజ్‌పాల్
మరికొద్దిసేపట్లో కోర్టు అతడికి శిక్ష విధించనుంది. ఈ నేపథ్యంలో తేజ్‌పాల్ స్పందించారు. తనపై దయ చూపాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తన వయస్సు 62 ఏళ్లని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను బాధితుడిని నమ్ముతున్నానని అన్నారు. తనకు భార్య కూడా ఉందని పేర్కొన్నారు. అంతుకు మించి చెప్పడానికి ఏమీ లేదంటూ తేజ్‌పాల్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు
For More National News And Telugu News