బంతిపూల సాగు.. భలే బాగు..
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:02 PM
సంప్రదాయ పంటలకు భిన్నంగా బంతిపూలను సాగుచేస్తూ రైతులు ఆదాయం పొందుతున్నారు.
మండలంలో 23ఎకరాల్లో బంతి తోటలు
రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు
బంతి రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
ఇల్లంతకుంట(కరీంనగర్): సంప్రదాయ పంటలకు భిన్నంగా బంతిపూలను సాగుచేస్తూ రైతులు ఆదాయం పొందుతున్నారు. కొద్దిమొత్తం పెట్టుబడి, తక్కువ నీటి వినియోగం ఉండే బంతితోటలు సాగుచేయడానికి కొందరు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, మహిళలకు ప్రీతి పాత్రమైన బతుకమ్మ పండుగకు బంతిపూలు ఇంటింటా అవసరం.
మండలంలోని ముస్కాని పేట, కేసన్నపల్లె, గాలిపెల్లి, ఎర్రనర్సుపల్లె, సిరి కొండ, ఇల్లంతకుంట తదితర గ్రామా లలోని రైతులు 23ఎకరాల విస్తీర్ణంలో బంతిపూలను సాగుచేశారు. మూడు నెలల్లో పూలు చేతికి వస్తాయి. ఎకరానికి దాదాపుగా రూ.20 వేలు వెచ్చిస్తే రెండింతల లాభం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. భూమిని చదును చేసి బంతిపూల నారు నాటాలి. నీటి వినియోగం తక్కువ కాగా చీడపీడలు వస్తే మందు లు పిచికారి చేయాల్సి ఉంటుంది.
బతుకమ్మ పండుగ వచ్చిందంటే రైతులు పూలు తెంపే పనిలో నిమగ్నం అవుతారు. బతుకమ్మ పండుగ నుంచి మొదలుకొని దీపా వళి వరకు అమ్మకాలు ఉంటాయని రైతులు అంటున్నారు. కిలోకు ఒక్కొక్కసారి రూ.130 సైతం వస్తుందని ఇలాంటప్పుడు అదనంగా లాభం వస్తుందని అంటున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత మంది రైతులు పూలసాగు వైపు మరిలే అవకాశం ఉంది.
ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి
బద్దం వంశీధర్‌రెడ్డి, ముస్కానిపేట
సంప్రదాయ పంటలకు భిన్నంగా ఇత పంటల ను సాగుచేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. బంతిపూల సాగును నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాభం వస్తుంది. గతంలో పట్టణాల నుంచి మాత్రమే పూలు వచ్చేవి. నేడు గ్రామాలలో అన్నిరకాల పూలతోటలు సాగు అవుతున్నాయి. గతంలో కంటే పూలసాగు మండలంలో పెరిగింది.
ఎకరాలకు రూ. 8వేల సబ్సిడీ అందిస్తుంది
గోవర్దన్, సిరిసిల్ల డివిజన్ ఉద్యాన శాఖాధికారి
పూలసాగు చేపట్టే రైతులకు తెలంగాణ ఉద్యాన శాఖ ద్వారా ఎకరానికి రూ. 8వేల సబ్సిడీ అందిస్తుంది. రైతులు పంటను సాగుచేసే సమయంలో విత్తనాలు, నారు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవాలి. ఉద్యానశాఖ కార్యాలయంలో బిల్లును ఇస్తే ఎమ్‌ఐడీహెచ్ కింద మొత్తాన్ని అందించడం జరుగుతుంది. పూలతోటల సాగులో రైతులు మెళుకువలు పాటించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి
రహస్యంగా వైద్యం చేయించుకుంటున్న కేటీఆర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News