సీపీఎం నేత ఎం.ఏ. గఫూర్‌కు పుత్రశోకం.. గుండెపోటుతో కుమారుడి మృతి
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:27 PM
సీపీఎం నేత ఎం. ఏ గఫూర్‌కు పుత్రశోకం కలిగింది. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కర్నూలు జిల్లా, అక్టోబర్ 10: ప్రజల పక్షాల తన గళాన్ని వినిపిస్తూ.. వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండే సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం. ఏ. గఫూర్ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే..
సీపీఎం సీనియర్ నేత ఎం. ఏ. గఫూర్ కుమారుడు పి. వి. కిరణ్ కాలిఫోర్నియాలో గుండెపోటుతో శుక్రవారం మృతిచెందారు. కుమారుడి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గఫూర్ కుమారుడి మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు, కార్యకర్తలు గఫూర్ నివాసానికి చేరుకుని వారిని పరామర్శిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News