Home » CPM
మారేడుమిల్లిలో వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లపై సీపీఎం నేత శ్రీనివాసరావు స్పందించారు. బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ వార్తలు వస్తున్నాయన్నారు.
బిహార్‌లో తగినంత వర్క్‌ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.
సీపీఎం కార్యాలయాన్ని కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు కళ్యాణవేదికగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం తెలిపారు. సోమవారం ఆయన తన ఎక్స్‌పేజీలో ఈ విషయం పోస్ట్‌చేశారు.
ఎన్నికల్లో కూటమి లేకుండా డీఎంకే గెలవడమన్నది అసాధ్యమని, 2019 లోక్‌సభ ఎన్నికల నుండి 2024 లోక్‌సభ ఎన్నికల దాకా మిత్రపక్షాలను కలుపుకునే ఆ పార్టీ గెలిచిందని, ఈ పరిస్థితి వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం వ్యాఖ్యానించారు.
మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపి మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి అని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లను హత్యాకాండగా ఖండిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి.
కరెంటు షాక్‌తో ప్రజలు పోతేగాని సంబంధిత అధికారులు స్పందించేలా లేరని సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. మండలంలోని కక్కలపల్లి గ్రామ ప్రజాశక్తి కాలనీలో నెలకొన్న విద్యుత సమస్యను పరిష్క రించాలంటూ సోమవారం సీపీఎం అధ్వర్యంలో స్థానిక సబ్‌స్టేషన కార్యాలయం ఎదుట ధర్నా చేపటా ్టరు.
ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత ఎంఏ బేబి తెలిపారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టకుండా సామరస్యాన్ని ప్రోత్సహించాలని పార్టీ నేతలు కోరారు
సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు కేంద్రం ఆపరేషన్ కగార్‌ను ఆదివాసీల నిర్మూలనకే చేపట్టిందని ఆరోపించారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం తీవ్రంగా విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో మూడుసార్లు ‘జై శ్రీరామ్’ అని పలికించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు
ఎంఏ బేబీ పేరును పార్టీ కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్ ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సీతారాం ఏచూరి మృతి అనంతరం ఆ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా కారత్ ఆ పదవిని నిర్వహిస్తూ వచ్చారు.