CPM: ప్రేమ వివాహాలకు మా పార్టీ ఆఫీసులు రెడీ..
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:46 AM
సీపీఎం కార్యాలయాన్ని కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు కళ్యాణవేదికగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం తెలిపారు. సోమవారం ఆయన తన ఎక్స్‌పేజీలో ఈ విషయం పోస్ట్‌చేశారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం
చెన్నై: సీపీఎం(CPM) కార్యాలయాన్ని కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు కళ్యాణవేదికగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం(P. Shanmugam) తెలిపారు. సోమవారం ఆయన తన ఎక్స్‌పేజీలో ఈ విషయం పోస్ట్‌చేశారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించలేదని,

వేర్వేరు కులాలకు చెందిన యవతీ, యువకులు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని తమ పార్టీ ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీపీఎం కార్యాలయాల్లో కులాంతర వివాహాలు జరుపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పరువు హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని షణ్ముగం డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News