సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jun 14 , 2026 | 02:48 PM
సింగరేణి కార్మికుడి శ్రమ, చెమటని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై చేస్తున్న ఆరోపణలతో తన మనసు కలచి వేసిందని.. అందుకే అధికారులతో కలిసి ఓపెన్‌హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు.
మంచిర్యాల, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): బొగ్గు నిల్వలు మాయమైనట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో శ్రీరాంపూర్ ఓసీపీ వద్ద సింగరేణి అధికారులతో కలిసి ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని ఈరోజు(ఆదివారం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికుడి శ్రమ, చెమటని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిపై చేస్తున్న ఆరోపణలతో తన మనసు కలచి వేసిందని.. అందుకే అధికారులతో కలిసి ఓపెన్‌హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు. మీ రాజకీయాల కోసం, స్వార్థం కోసం తెలంగాణ భవిష్యత్తు అయిన సింగరేణిని అపహాస్యం చేయొద్దని హితవు పలికారు. బొగ్గును వెలికి తీసిన తర్వాత గ్రేడ్‌ల వారీగా స్టాక్ పెడతామని వివరించారు. నిల్వలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని వివరించారు. బొగ్గు తరలించే వాహనాలకు జీపీఎస్ సైతం ఉంటుందని స్పష్టం చేశారు. విజిలెన్స్ మానిటరింగ్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కిలో బొగ్గు బయటకు వెళ్లే అవకాశం లేదని తేల్చిచెప్పారు.
అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోంది: మల్లు భట్టి విక్రమార్క
ఎస్ఐఆర్‌ను అడ్డంపెట్టుకొని అసలైన ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఓటు లేకపోతే పౌరసత్వానికి ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇవాళ మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ బీఎల్ఏల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావ్, ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే వారిని ఏఐ టెక్నాలజీతో లిస్టు ఔట్ చేస్తున్నారని.. వారందరిని హోల్డ్‌లో పెడుతున్నారని తెలిపారు. బీజేపీ నేతలు చాలా ప్లాన్డ్‌గా ఓట్ల తొలగిస్తున్నారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అయ్యే సమయంలో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని.. కానీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓటర్ల మ్యాపింగ్ కాలేదని 80 వేల మందిని అన్ మ్యాపింగ్ చేశారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
సింగరేణిపై కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: మంత్రి శ్రీధర్ బాబు
నిరంతరం సింగరేణిపై కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహించారు. పదే పదే అసత్యాలతో నాటి తప్పులను కప్పి పుచ్చుకోలేరని అన్నారు. సింగరేణిని కాపాడేది కేవలం కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క
‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News