ఉద్యోగాల పేరుతో మోసం.. యూట్యూబర్ నందన అరెస్ట్
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:48 PM
యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనను గుర్తించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ నందనను (YouTuber Nandana) శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనను గుర్తించారు. ఎయిర్‌పోర్టులో ఆమెను అదుపులోకి తీసుకున్న అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు.. ఆర్‌జీఐఏ పోలీసులు అప్పగించారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. నందనపై ఉన్న కేసులు, లుక్‌అవుట్ నోటీసుల ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News