ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు.. ట్రైనీ IPS వాంగ్మూలం రికార్డు
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:21 AM
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో పోలీసులు వేగం పెంచారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో (Trainee IPS Uday Krishna Reddy Case) పోలీసులు వేగం పెంచారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు బదిలీ అనంతరం డీసీపీ లావణ్య ఈరోజు (బుధవారం) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుని దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించారు. కేసులో ఫిర్యాదు చేసిన ట్రైనీ ఐపీఎస్ అధికారి వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఆమె అకాడమీకి వెళ్లారు.
అకాడమీలో ఉన్నతాధికారుల సమక్షంలో ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు, అందుబాటులో ఉన్న డిజిటల్, ఇతర ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించనున్నారు.
మహిళా భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ కేసును ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసు దర్యాప్తు సమయంలో అకాడమీలోని అధికారులు, సహచర ట్రైనీలు, ఇతర సంబంధిత వ్యక్తుల వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంది. కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి వాస్తవాలను ప్రత్యేక దర్యాప్తు బృందం వెలుగులోకి తీసుకురానుంది. డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ విచారణలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చే వాంగ్మూలం కీలక ఆధారంగా మారనుంది. ఈ తాజా పరిణామాలతో ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News