తెలంగాణలో ఎక్సైజ్ దాడులు.. గంజాయి స్మగ్లర్ల వద్ద మారణాయుధాలు స్వాధీనం
ABN , Publish Date - Oct 24 , 2026 | 09:22 PM
ఎక్సైజ్ అధికారులు ఈరోజు (శనివారం) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మారణాయుధాలు కలకలం సృష్టించాయి.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ అధికారులు ఈరోజు (శనివారం) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మారణాయుధాలు కలకలం సృష్టించాయి. గంజాయి స్మగ్లర్ల వద్ద పిస్తోళ్లు, రివాల్వర్లు, బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో గంజాయితో పాటు రివాల్వర్, నాలుగు పిస్తోళ్లను పట్టుకున్నారు. మరో కేసులో భద్రాచలం - పాల్వంచ మార్గంలో 106 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ కేసులో ఒక పిస్తోలు, ఐదు రివాల్వర్లు, 40 బుల్లెట్లు, 12 ఖాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు.
రెండు ఘటనల్లోనూ గంజాయి అక్రమ రవాణాతో పాటు ఆయుధాల లభ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి స్మగ్లింగ్ ముఠాలకు ఆయుధాలు ఎలా అందుతున్నాయనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయుధాలు లేకుండా దాడులకు వెళ్తున్న ఎక్సైజ్ సిబ్బంది భద్రతపై పలువురు ప్రశ్నలను లెవనెత్తుతున్నారు. ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. పోలీస్, ఎక్సైజ్, ఈగల్ టీమ్స్ సమన్వయంతో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని పలువురు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News