క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Oct 23 , 2026 | 02:38 PM
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మూడు విడతల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. మూడు విడతల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) ఇందిరమ్మ టవర్స్‌పై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పేదల ఉపాధికి ఆటంకం లేకుండా నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ టవర్స్ నిర్మాణానికి భూముల గుర్తింపును వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి..
మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500ల ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. రెండో, మూడో విడతల నిర్మాణాలకు ముందుగానే స్థలాలను గుర్తిస్తున్నామని అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో ఆన్‌లైన్ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. డ్రా ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశామని అన్నారు. యూట్యూబ్‌లో ఎప్పుడైనా లబ్ధిదారుల ఎంపిక వివరాలు చూసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మా ప్రభుత్వంలో ముదిరాజ్‌లను భాగస్వాములను చేసే బాధ్యత నాది: సీఎం రేవంత్‌రెడ్డి
టీడీఆర్ సేవలకు ఆధార్‌తో గుర్తింపు నిర్ధారణకు ప్రభుత్వం అనుమతి
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News