Share News

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

ABN , Publish Date - May 13 , 2026 | 09:48 AM

హైదరాబాద్ నగరం‏ ముషీరాబాద్‌లోని చిలకలగూడ రిజర్వాయర్‌ పరిధిలో వాటర్‌ ట్యాంక్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

 వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌
Summer, Water Tankers

  • ముషీరాబాద్‌లో ప్రతిరోజూ 100 బుకింగ్‌

  • భూగర్భ జలాలు అడుగంటడమే కారణం

హైదరాబాద్: హైదరాబాద్ నగరం ముషీరాబాద్‌లోని చిలకలగూడ రిజర్వాయర్‌ పరిధిలో వాటర్‌ ట్యాంక్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతంతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో ట్యాంకర్లను ప్రజలు బుకింగ్‌ చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోవడం వల్లే వాటర్‌ ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగిందని అధికారులంటున్నారు.


సప్లయికి ఒక్క రోజు వెయింటింగ్‌

చిలకలగూడ రిజర్వాయర్‌ పరిధిలో ప్రతిరోజూ 92 నుంచి వందకు పైగా వాటర్‌ ట్యాంక్‌లు కావాలని ప్రజలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటున్నారు. గత నెల 15వ తేదీ వరకు ప్రతిరోజూ 50 నుంచి 60 ట్యాంకర్లను బుక్‌ చేసుకోగా ప్రస్తుతం ప్రతిరోజూ 100కు పైగా వాటర్‌ ట్యాంక్‌ల కోసం ప్రజలు బుక్‌ చేసుకుంటున్నారు. వీరందరికి సప్లయ్‌ చేయడానికి ఒక్క రోజు సమయం పడుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు.


city5.2.jpgరెండు విడతల సప్లయ్‌

రిజర్వాయర్‌ పరిధిలో రెండు ఫిల్లింగ్‌ సెక్షన్‌లు ఉన్నాయి. 5 పేమెంట్‌ ట్యాంకర్‌లు, ఒకటి ఫ్రీ ట్యాంకర్‌లు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం షిఫ్ట్‌లు వారీగా సప్లయ్‌ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. క్రమంగా పెరుగుతున్న ధరలు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 09:48 AM