గోల్డ్, సిల్వర్ రేట్స్.. క్రమంగా పెరుగుతున్న ధరలు
ABN , Publish Date - May 13 , 2026 | 07:07 AM
దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1,550ల మేర పెరిగింది. అయితే, ఈ వారంలో సగటు పెరుగుదల ఓ మోస్తరు స్థాయిలోనే ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 13) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,999గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,160 వద్ద కొనసాగుతోంది. నగరంలో వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.3,00,100గా ఉంది.
దేశవ్యాప్తంగా చూస్తే చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర గరిష్ఠంగా రూ.1,56,340గా ఉంది. ముంబైలో రూ.1,53,990ల వద్ద, ఢిల్లీలో రూ.1,54,140ల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,310 కాగా, ఢిల్లీలో 1,41,310గా, ముంబైలో రూ.1,41,160గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కును తాకింది. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా వెండి ధరలు రూ.3 లక్షల మార్కుకు చేరువగా ఉన్నాయి.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
నష్టాల్లో సూచీలు.. 4 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఫట్
డాక్టర్ రెడ్డీస్‌కు అమెరికా దెబ్బ