Share News

వేసవిలో డీహైడ్రేషన్‌కు చెక్‌ పెట్టే డ్రింక్‌.. సత్తు షర్బత్

ABN , Publish Date - May 13 , 2026 | 08:06 AM

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్‌, అలసట వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుతూ తక్షణ శక్తిని అందించే సత్తు షర్బత్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో డీహైడ్రేషన్‌కు చెక్‌ పెట్టే డ్రింక్‌.. సత్తు షర్బత్
Sattu Sharbat Benefits

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్‌, నీరసం, తల తిరగడం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుతూ తక్షణ శక్తిని ఇచ్చే పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిలో సత్తు షర్బత్‌ ఒకటి. దీనిని చాలామంది 'దేశీ టానిక్‌' అని కూడా పిలుస్తారు.


సత్తు అనేది వేయించిన శనగలు, బార్లీ లేదా మొక్కజొన్నను పొడిగా తయారు చేసిన ఆహారం. ఇందులో ప్రోటీన్‌, ఫైబర్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని పేదల ప్రోటీన్‌ అని కూడా అంటారు. సత్తు పొడి శరీరాన్ని లోపల నుంచి చల్లబరచడంలో సహాయపడుతుంది. అలాగే వడదెబ్బ నుంచి రక్షించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక గ్లాసు సత్తు షర్బత్‌ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.

సత్తు షర్బత్‌ను ఎలా తయారు చేసుకోవాలి?

సత్తును తీపిగా లేదా ఉప్పుగా రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు.

  • అర కప్పు సత్తు పొడి

  • ఒక గ్లాసు చల్లటి నీరు

  • వేయించిన జీలకర్ర పొడి

  • నిమ్మరసం

  • సన్నగా తరిగిన కొత్తిమీర

  • తీపిగా కావాలంటే బెల్లం లేదా తేనె కలిపి తాగవచ్చు. ఉప్పగా కావాలంటే నల్ల ఉప్పు కలుపుకోచ్చు.

  • ఇవన్నీ బాగా కలిపి తాగితే శరీరానికి చల్లదనం లభిస్తుంది.


సత్తు షర్బత్‌ వల్ల కలిగే ప్రయోజనాలు

  • శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

  • వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.

  • తక్షణ శక్తిని అందిస్తుంది.

  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

  • మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.

  • ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది.

  • బరువు నియంత్రణకు సహాయపడుతుంది.

  • డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.

  • మధుమేహం ఉన్నవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

సత్తు చవకైనదే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే భారతీయ సూపర్ ఫుడ్‌గా భావిస్తారు. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే మీ రోజువారీ ఆహారంలో సత్తును చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - May 13 , 2026 | 08:06 AM