ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లు ఇవే..
ABN , Publish Date - May 12 , 2026 | 10:17 AM
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం, వ్యాయామంతో పాటు రోజువారీ అలవాట్లను కూడా సరిచేసుకోవాలి. లేదంటే మనం తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనుకుంటారు. అందుకోసం వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం వంటి విషయాలపై శ్రద్ధ పెడతారు. కానీ కొన్ని రోజువారీ అలవాట్లు మన ఆరోగ్యంపై తెలియకుండానే చెడు ప్రభావం చూపిస్తాయి. అందుకే అలాంటి అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం.
ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లు ఇవే
ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం
చాలామంది మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటారు. ఇది పెద్ద సమస్యలా అనిపించకపోయినా, తర్వాత మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి. అలాగే, మొబైల్ చూస్తూ టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది రక్తనాళాలపై ఒత్తిడి పెంచి మొలలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
నోరు తెరిచి నిద్రపోవడం
కొంతమందికి నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్ సమస్యలకు కారణం కావచ్చు.
ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం
ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం వెన్ను, మెడ నొప్పులకు కారణం అవుతుంది. అలాగే కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ముఖాన్ని తరచుగా తాకడం
రోజంతా చేతులు ఎన్నో వస్తువులను తాకుతాయి. వాటితోనే ముఖాన్ని తాకితే బ్యాక్టీరియా చర్మానికి చేరి ఇన్ఫెక్షన్లు, మొటిమలు రావచ్చు.
తొందరగా తినడం
ఆహారాన్ని చాలా వేగంగా తినే అలవాటు వల్ల అవసరానికి మించి ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీని వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం ఆరోగ్యానికి మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News