ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:45 PM
ప్రస్తుతం కాలంలో మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం కాలంలో మారుతున్న వాతావరణం, కాలుష్యం కారణంగా త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. దీని కోసం ఖరీదైన మందులు అవసరం లేదు, మన వంటింట్లో నిత్యం వాడే మసాలా దినుసులే అద్బుతమైన యాంటీ బయాటిక్స్‌గా పనిచేస్తాయి. మన వంటింట్లో లభించే మసాలా దినుసులతో రోగనిరోధక శక్తిని ఎలా పెచుకోవచ్చు అన్న విషయం గురించి తెలుసుకుందాం.
1. పసుపు:
మనం నిత్యం వాడే పసుపులో ఉండే 'కర్కుమిన్' అనే పదార్థం అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి.
2. అల్లం:
అల్లం చూడటానికి ఘాటుగా ఉన్నా.. దీన్ని తింటే సకల రోగాలు మాయం అంటారు పెద్దలు. అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే 'జింజెరాల్స్' ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. పరగడుపున అల్లం రసం లేదా అల్లం టీ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
3. వెల్లుల్లి:
వెల్లుల్లిని 'నేచురల్ యాంటీ బయాటిక్' అని పిలుస్తారు. వంటింట్లో ఏదో ఒక రకంగా దీన్ని వాడుతూనే ఉంటారు. ఇందులో ఉండే 'అల్లిసిన్' గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక కణాలను ఉత్తేజ పరుస్తోంది. ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను తింటే బీపీ నియంత్రణలో ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
4. దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది కేవలం వాసన కోసమే కాదు, శరీరంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి కూడా తోడ్పడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
5. మిరియాలు:
మిర్యాలు ఎంత ఘటుగా ఉంటాయో.. దాని ఫలితాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. నల్ల మిరియాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. విటమిన్-సి పుష్కలంగా ఉండే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలు దరిచేరవు.
6. లవంగాలు:
సుగంధ ద్రవ్యాల్లో లవంగాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. లవంగాల్లో యాంటీ సెప్టిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి పంటి నొప్పిని తగ్గించడమే కాకుండా, రక్తంలోని తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. గొంతు గరగరగా ఉన్నప్పుడు ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.
7. జీలకర్ర:
జిలకర్ర లేనిదే ఏ వంట ఉండదు అంటారు. జీలకర్ర జీర్ణక్రియకు ప్రాణవాయువు వంటిది. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
8. వాము:
వాములో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. శీతాకాలంలో వచ్చే దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులకు వాము అద్భుత ఔషధం. కొద్దిగా వామును వేడి చేసి ఆ వాసన పీల్చడం లేదా వాము నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్ర పడతాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Latest News