జస్ట్ రూ.10 లతో జ్యూస్.. శరిరాన్ని డిటాక్స్ చేసేస్తుంది..!
ABN , Publish Date - May 12 , 2026 | 05:22 PM
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి ఆహారం తింటే.. ఆరోగ్యం బాగుంటుంది. అలా కాదని జంక్ ఫుడ్స్, ప్యాక్‌డ్ ఫుడ్స్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే.. తినే ఆహారం విషయంలో చాలా నియంత్రణగా ఉండాలి.
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి ఆహారం తింటే.. ఆరోగ్యం బాగుంటుంది. అలా కాదని జంక్ ఫుడ్స్, ప్యాక్‌డ్ ఫుడ్స్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే.. తినే ఆహారం విషయంలో చాలా నియంత్రణగా ఉండాలి. ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు బయటి ఆహారాలకు అలవాటు పడి.. తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లాలి. అలా కాకుండా వ్యర్థాలన్నీ శరీరంలో పేరకుపోతే.. అనారోగ్యానికి గురవుతారు. మరి ఈ వ్యర్థాలను ఎలా బయటకు పంపాలి.. ఒకటి వ్యాయామం.. రెండు జ్యూస్‌లతో శరీరాన్ని డిటాక్స్ చేయొచ్చు. కొంత మంది తమ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఖరీదైన ఫ్రూట్ జ్యూస్‌లు తాగుతుంటారు. మరికొందరు ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతిలో లభించే డిటాక్స్ డ్రింక్స్‌ని ఉపయోగిస్తారు.
ఇంత ఖర్చు చేసి డిటాక్స్ డ్రింక్స్ తాగాల్సిన అవసరం లేదు. మనం రోజూ వంటకాల్లో వినియోగించే కొత్తిమీరతోనే శరీరాన్ని డిటాక్స్ చేసుకోవచ్చు. వంటకాల్లో వినియోగించే కొత్తిమీరలో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్లు కె, సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే యాంటిఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కొత్తిమీరలోని సహజసిద్ధమైన పోషకాలు.. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.
కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే శరీరాన్ని డిటాక్స్ చేయొచ్చు. వేసవిలో ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అలసట కూడా తగ్గుతుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కూడా తగ్గిస్తుంది. శరీర బరువును నియంత్రించడంలోనూ అద్భుతంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రింస్తుంది. అంతేకాదు.. కొత్తిమీర జ్యూస్ రోజూ తాగడం వలన చర్మకాంతి పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కొత్తిమీర జ్యూస్ ఎలా తయారు చేయాలి..
ఒక కొత్తిమీర కట్ట తీసుకొని.. దానిని కట్ చేయాలి. కొన్ని వాటర్ కలిపి గ్రైండ్ చేయాలి. ఆ తరువాత వడకట్టి.. ఆ జ్యూస్‌లో కాస్త నిమ్మరం కలపాలి. అంతే.. కొత్తిమీర జ్యూస్ రెడీ అయిపోయింది. ఆ తరువాత జ్యూస్‌ను తాగేయొచ్చు.
ఎప్పుడు తాగితే మంచిది..
కొత్తిమీర జ్యూస్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మేలు జరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు వెళతాయి. తద్వారా అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టి ఉంచుకొని, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధ్రువీకరించడం లేదు.
Also Read:
టూరిస్టు బస్సుకు ఘోర ప్రమాదం.. వేగంగా దూసుకెళ్లి..
బహిరంగ ప్రదేశాల్లో పార్టీ బ్యానర్లు, ప్లకార్డులు వద్దు.. క్యాడర్‌కు టీవీకే వార్నింగ్
రైల్ రోకో కేసులో కవితకు సమన్లు..