Share News

బహిరంగ ప్రదేశాల్లో పార్టీ బ్యానర్లు, ప్లకార్డులు వద్దు.. క్యాడర్‌కు టీవీకే వార్నింగ్

ABN , Publish Date - May 12 , 2026 | 04:42 PM

తమిళనాడులోని అధికార తమిళగ వెట్రి కళగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. ప్రజలకు అసౌకర్యం కల్పించడం కానీ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించడం కానీ చేయవద్దని సూచించింది.

బహిరంగ ప్రదేశాల్లో పార్టీ బ్యానర్లు, ప్లకార్డులు వద్దు.. క్యాడర్‌కు టీవీకే వార్నింగ్
Vijay

చెన్నై: తమిళనాడులోని అధికార తమిళగ వెట్రి కళగం (TVK) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని పార్టీ కార్యకర్తలకు ఆదేశాలిచ్చింది. ప్రజలకు అసౌకర్యం కలిగించడం కానీ, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించడం కానీ చేయవద్దని సూచించింది. ప్రజా సంక్షేమమే పార్టీకి అత్యంత ప్రాధాన్యమని, పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీవీకే ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్.ఆనంద్ ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.


పార్టీకి సంబంధించిన డిస్‌ప్లేలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే తాము ఈ ఆదేశాలు జారీ చేశామని ఆనంద్ పేర్కొన్నారు. 'తమిళనాడు ప్రజల సంక్షేమమే పరమావధిగా తమిళ వెట్రి కళగం ఏర్పాటయింది. తమిళ ప్రజల అభిమానాన్ని చూరగొని విజయం సాధించిన విజయ్‌ మనకు గురుతర బాధ్యత అప్పగించారు. ఆ లక్ష్యం దిశగా మనం తప్పనిసరిగా ప్రయాణం సాగించాలి' అని అన్నారు.


బర్త్‌డే వేడుకలు, కుటుంబ వేడుకలు వంటి సందర్భాల్లో పార్టీ కార్యకర్తలు ఎవరూ వీధులు, బహిరంగ ప్రదేశాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించే చోట్ల బ్యానర్లు, పోస్టర్లు పెట్టవద్దని, ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని ఆ ప్రకటనలో కోరారు. ఇందుకు భిన్నంగా ఎవరు వ్యవహిరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


ఇవి కూడా చదవండి..

విజయ్‌కు విజిల్ వేసి అభినందనలు చెప్పిన విశాల్

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్

Updated Date - May 12 , 2026 | 05:00 PM