మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్
ABN , Publish Date - May 12 , 2026 | 10:32 AM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్‌స్టాండ్స్‌కి 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులన్నింటినీ క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్‌స్టాండ్స్‌కి 500 మీటర్ల దూరంలో ఉన్న 717 వైన్ షాపులన్నింటినీ క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విజయ్ జారీ చేసిన తొలి ఉత్తర్వు ఇది.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో టాస్మాక్ 4,765 మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. వీటిలో 276 మద్యం దుకాణాలు ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యా సంస్థల సమీపంలో, 255 బస్ స్టాండ్‌ల సమీపంలో ఉన్నాయి. వీటిని వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. కాగా మద్యం అమ్మకాల ద్వారానే రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ.. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. 2025 సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ.48,000 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
Also Read:
ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లు ఇవే..
అన్నాడీఎంకేలో తిరుగుబాటు.. విజయ్ టీవీకేకు షణ్ముగం వర్గం మద్దతు
హైదరాబాద్‌లో రూ.15 లక్షల బ్యాగ్ చోరీ... ముగ్గురి అరెస్ట్