Share News

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..

ABN , Publish Date - May 13 , 2026 | 08:36 AM

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్‌ మోసం జరుగుతోందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్స్‌..
APK Scam, Cyber Crime

  • వాట్సాప్‏లో వచ్చే లింకులతో జాగ్రత్త

హైదరాబాద్‌ సిటీ: వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ‘ఆర్‌టీఓ చలాన్‌ ఏపీకే’ పేరుతో కొత్త సైబర్‌ మోసం జరుగుతోందని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‏ల ద్వారా ‘మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్‌ పెండింగ్‌లో ఉంది, జరిమానా వెంటనే చెల్లించండి’ అంటూ సందేశాలు పంపి, అందులోని లింక్‌ ద్వారా ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని కోరుతున్నారు. ఈ ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తే హ్యాకర్లు మొబైల్‌పై పూర్తి నియంత్రణ సాధించి బ్యాంక్‌ ఖాతాలు,


city4.2.jpgఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని దోచుకునే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు వాట్సాప్‌ లేదా ఎంఎ్‌సఎం ద్వారా ఏపీకే ఫైళ్లను పంపవని, సందేశాలు సాధారణ మొబైల్‌ నంబర్ల నుంచి వస్తాయని తెలిపారు. ట్రాఫిక్‌ చలాన్‌ వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లి తెలుసుకొన్న తర్వాతే పేమెంట్స్‌ చేయాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. క్రమంగా పెరుగుతున్న ధరలు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 08:36 AM