Share News

ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కొడుకు హఠాన్మరణం

ABN , Publish Date - May 13 , 2026 | 08:07 AM

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) బుధవారం ఉదయం లఖ్‌నవూలో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కొడుకు హఠాన్మరణం

ఇంటర్నెట్ డెస్క్: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) హఠాన్మరణం చెందారు. బుధవారం ఉదయం 6:15 గంటల సమయంలో ప్రతీక్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను లఖ్‌నవూ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


praeej.jpgప్రతీక్ యాదవ్ మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక పరిశీలనలో ఆయన శరీరంపై ఎటువంటి గాయాల గుర్తులు కనిపించలేదని వైద్యులు పేర్కొన్నారు. మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU) వైద్యుల బృందం మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనుంది.

ప్రతీక్ యాదవ్.. మూలాయం సింగ్ యాదవ్ రెండో భార్య కుమారుడు, బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్ భర్త. రాజకీయ కుటుంబంలో జన్మించినప్పటికీ, ప్రతీక్ యాదవ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్, ఫిట్‌నెస్ రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణం ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..

ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2026 | 10:33 AM